కోల్‌కతా 11 మార్చి (హి.స.),:పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తపసీ మండల్ సోమవారం తృణమూల్ కాంగ్రె్‌సలో చేరారు. ఆమె తూర్పు మిడ్నాపూర్ జిల్లా హల్దియా (ఎస్సీ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలను ఇంకెంతమాత్రం ఆమోదించలేనని ప్రకటించారు 2016లో సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె 2020లో బీజేపీలో చేరారు. 2021లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా రాష్ట్ర మంత్రి అనూప్ బిశ్వాస్ నుంచి తృణమూల్ జెండాను అందుకొని ఆ పార్టీలో చేరారు. ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు శ్యామల్ మెయిటీ కూడా తృణమూల్ కాంగ్రె్‌సలో చేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల