తెలంగాణ, వరంగల్. 11 మార్చి (హి.స.) వరంగల్ జిల్లాలోని
నర్సంపేట పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాదన్నపేట్ రోడ్డు లో ఉన్న ఓ భూమి మాదీ అంటే.. కాదు మాదీ అంటూ ఇరు వర్గాలు మంగళవారం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి.
పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోని సర్వే నెంబర్ 111లో గత కొన్ని రోజులుగా భూమిపై వివాదం కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య వివాదం ముదిరి తారాస్థాయికి చేరుకుని నేడు .. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదర గొట్టారు. జనాలను చెదరగొట్టే క్రమంలో స్థానిక ఎస్సై రవికుమార్ కి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సండే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్