తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..హైదరాబాదులోని రేణుకా ఎల్లమ్మ దేవస్థాన అభివృద్ధి పనులకు ప్రసాదు పథకం లో భాగంగా ఆమోదం..
తెలంగాణ, హైదరాబాద్. 11 మార్చి (హి.స.) దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 'ప్రసాద్' పథకంలో భాగంగా హైదరాబాదులోని ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ దేవస్థాన అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట
ప్రసాదు పథకం


తెలంగాణ, హైదరాబాద్. 11 మార్చి (హి.స.)

దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 'ప్రసాద్' పథకంలో భాగంగా హైదరాబాదులోని ప్రసిద్ధ రేణుకా ఎల్లమ్మ దేవస్థాన అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 4.21 కోట్ల వ్యయంతో, ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ లకు ధన్యవాదాలు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande