కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరను విజయవంతం చేయడమే పోలీసు శాఖ వారి లక్ష్యం.. మామునూరు ఏసీపీ తిరుపతి.
తెలంగాణ, వరంగల్. 11 మార్చి (హి.స.) ఈనెల 14న జరగనున్న వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరను విజయవంతం చేయడమే పోలీసు శాఖ వారి లక్ష్యం అని మామునూరు ఏసీపీ తిరుపతి అన్నారు. కొమ్మాల ఆలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం పోలీసుల
మామునూరు ఏసీపీ తిరుపతి.


తెలంగాణ, వరంగల్. 11 మార్చి (హి.స.) ఈనెల 14న జరగనున్న వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరను విజయవంతం చేయడమే పోలీసు శాఖ వారి లక్ష్యం అని మామునూరు ఏసీపీ తిరుపతి అన్నారు.

కొమ్మాల ఆలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ

సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకుల నుంచి సలహాలు సూచనలు ఏసిపి తీసుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు

మాట్లాడుతూ..పోలీసు శాఖ వారు ప్రభబండ్ల ప్రవేశం నిష్క్రమణంను నియంత్రిస్తే జాతరలో ఇబ్బంది కలగదని అన్నారు. అన్ని పార్టీల ప్రభలకు పోలీస్ శాఖ వారు కేటాయించిన సమయాన్ని తూచా తప్పకుండా పాటించి భక్తి భావంతో ప్రభలను నిర్వహించి, శాంతియుతంగా జాతరను విజయవంతం చేయాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande