విజయవాడ, 11 మార్చి (హి.స.)పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదైంది.
బీఎన్ ఎస్ 353(1) , 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి పిటి వారెంట్ పై తెచ్చిన పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేసింది మేజిస్ట్రేట్. మరోవైపు ప్రభుత్వ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల