ఢిల్లీ 11 మార్చి (హి.స.)ఐపీఎల్ నిధుల కుంభకోణంలో నిందితుడైన మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి గట్టి షాక్ తగిలింది. గత 15 ఏళ్లుగా బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆయన ఇటీవల పొందిన వనాటు పౌరసత్వం రద్దయింది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోథం నపాట్ ఆదేశించారు. దీనిపై చర్యలు చేపట్టాలని సోమవారం ఆయన పౌరసత్వ కమిషన్‌కు సూచించారు. భారత పౌరసత్వాన్ని వదులుకుని వనాటులో స్థిరపడాలని భావించిన లలిత్ మోదీ.. ఇటీవలే తన పాస్‌పోర్టును రద్దు చేయాలని లండన్‌లోని భారత హైకమిషన్‌లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వం లలిత్ మోదీ పాస్‌పోర్టును రద్దు చేస్తే బ్రిటన్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లవుతుంది. వనాటు ఎలాగూ పాస్‌పోర్టును రద్దు చేయడంతో ఆయనకు ఎటూ పాలుపోదు. ఫలితంగా బ్రిటన్ నుంచి బహిష్కరణకు గురికావొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు