తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 11 మార్చి (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ గా పనిచేసే తోట గంగారాం(58) లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సిరిసిల్లలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే గంగారాం సోమవారం రాత్రి భోజనం చేశాక అర్ధరాత్రి బయటకు వెళ్ళేందుకు లిఫ్ట్ వద్ద వెయిట్ చేశారు. లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో లిఫ్ట్ లో క్రిందకి పడ్డాడు. మూడో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ బేస్ పై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి లిఫ్ట్ అడుగు భాగంలో పడిపోయిన గంగారం ను అతి కష్టం మీద తీసి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిద్దుల...
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్