న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.)
రాజ్యసభలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయన డిప్యూటీ చైర్మెన్ హరివంశ్కు క్షమాపణలు చెప్పారు. జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై చర్చ చేపట్టేంందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ఖర్గే అన్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని తోసి వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తోకేంగే అంటూ హిందీ పదాన్ని వాడారు. దీని పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్ను చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు ఖర్గే తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..