గ్రామాల అభివృద్ధికి రోడ్డు మార్గాలే ప్రధానమైనవి.. ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్.
తెలంగాణ, నిర్మల్. 11 మార్చి (హి.స.) గ్రామాల అభివృద్ధికి రోడ్డు మార్గాలే ప్రధానమైనవని ముధోల్ బిజెపి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని డోడర్నా నుంచి మహారాష్ట్ర వాసి బోర్డర్ వరకు రూ. 7 కోట్ల 68 లక్షలతో చేపట్టే రోడ్డు పనులక
ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్.


తెలంగాణ, నిర్మల్. 11 మార్చి (హి.స.) గ్రామాల అభివృద్ధికి రోడ్డు మార్గాలే ప్రధానమైనవని ముధోల్ బిజెపి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని డోడర్నా నుంచి మహారాష్ట్ర వాసి బోర్డర్ వరకు రూ. 7 కోట్ల 68 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు

చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు మార్గం పూర్తయితే గిరిజన గ్రామాలతో పాటు వాణిజ్య వర్తక వ్యాపారాలు మెరుగు పడతాయి అన్నారు.

మండల వాసులకు దగ్గర్లో ఉన్న హిమాయత్ నగర్ రైలు మార్గాన్ని కూడా ఉపయోగించుకునే వీలు కలుగుతుందని గుర్తుచేశారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande