నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు.. కనీస మద్దతు ధర లభించడం లేదంటూ రైతుల ఆందోళన..
.
నిజామాబాద్ మార్కెట్


తెలంగాణ, నిజామాబాద్. 11 మార్చి (హి.స.)

నిజామాబాద్ లోని మార్కెట్ యార్డుకు మంగళవారం పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా పసుపు అమ్మకానికి రావడంతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది.

ఇది ఇలా ఉండగా కనీస మద్దతు ధరతో పసుపును కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వ్యాపారులు రైతులతో జరిపిన చర్చల అనంతరం కటాఫ్కు 500 ధర తగ్గిస్తే పసుపు యథావిధిగా కొనుగోలు చేస్తామంటూ వ్యాపారులు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక రైతులు ఒప్పుకున్నారు.

దీంతో.. క్వింటాకు 500 ధర తగ్గిస్తూ 9500 రూపాయలకు కొనుగోలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం క్వింటాల్కు రూ.18000 వరకు ధర పలుకగా.. ఈసారి రూ. 10వేల లోపు కనీస ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande