రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ..
న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.) ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్నారు. మంగళవారం పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం లభించింది. సోమవారం అర్ధరాత్రి మోడీ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలతో కొత్త
మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.)

ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్నారు. మంగళవారం పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం లభించింది. సోమవారం అర్ధరాత్రి మోడీ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలతో కొత్త అధ్యాయనం ప్రారంభించబోతున్నట్లు మోడీ పేర్కొన్నారు. బుధవరం మారిషస్ 57వ జాతీయ దినోత్సవం జరగనుంది. గౌరవ అతిథిగా మోడీ పాల్గొననున్నారు.

మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రాములం ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ద్వీప దేశంలోకి అడుగుపెట్టారు. మంగళవారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, అనేక ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande