శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి సస్పెండ్..
తిరుపతి, 11 మార్చి (హి.స.) టిటిడి కు చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని నేడు సస్పెండ్ చేశారు. వివరాలలోకి వెళితే శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ క
టీటీడీ ఉద్యోగి సస్పెండ్


తిరుపతి, 11 మార్చి (హి.స.)

టిటిడి కు చెందిన శ్రీవారి

ఆలయ పరకామణి లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని నేడు సస్పెండ్ చేశారు. వివరాలలోకి వెళితే శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన టిటిడి విజిలెన్స్ విభాగం.. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృష్ణకుమార్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్దరించింది. ఈ మేరకు ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్ ను ఈవో సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడు ఆయన జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande