ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్
న్యూఢిల్లీ. 11 మార్చి (హి.స.) ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ నేడు ప్రవేశపెట్టారు. అక్రమచొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం. భారత్లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.
ఇమిగ్రేషన్ బిల్లు


న్యూఢిల్లీ. 11 మార్చి (హి.స.)

ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ నేడు ప్రవేశపెట్టారు. అక్రమచొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం. భారత్లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్పోర్టులు, వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు. తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించనున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande