బంగారం స్మగ్లింగ్.కేసులో కీలక. ట్విస్ట్ చోటుచేసుకుంది
విజయవాడ, 11 మార్చి (హి.స.)బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా
బంగారం స్మగ్లింగ్.కేసులో కీలక. ట్విస్ట్ చోటుచేసుకుంది


విజయవాడ, 11 మార్చి (హి.స.)బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.

రన్యారావు.. మొబైల్ డేటాను పరిశీలించగా తరుణ్ రాజుతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రన్యారావుకు ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. కానీ ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ రాజుతో రన్యారావుకు సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. కాల్ డేటా ప్రకారం తరుణ్ రాజుతోనే రన్యారావు సంబంధం కొనసాగించినట్లుగా అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ రవాణాలో తరుణ్ రాజు పాత్ర ప్రముఖంగా తేలింది. ప్రస్తుతం తరుణ్ రాజును లోతుగా విచారిస్తున్నారు. ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలను అధికారులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande