దిల్లీ:, 11 మార్చి (హి.స.)ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత కొరవడిందని, ఓటరు జాబితాల్లోనూ అవకతవకలు జరిగాయని పార్లమెంటులో విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. దీనిపై సమగ్ర చర్చ జరగాలని ఉభయసభల్లోనూ ప్రతిపక్ష నేతలు సోమవారం డిమాండ్ చేశారు. లోక్‌సభలో శూన్యగంటలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇది చాలా త్రీవమైన విషయమని, ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకోవాలని, పార్లమెంటులో చర్చించాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్ ఎంపీలు కూడా డిమాండ్ చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఓటరు జాబితాలను మళ్లీ తయారు చేయాలని టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు