తెలంగాణ, 2 మార్చి (హి.స.)
మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్