తెలంగాణ, 2 మార్చి (హి.స.)
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని... మామునూరు రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వచ్చి చర్చించారు.. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం మమునూరు ఎయిర్ పోర్ట్.. స్వాతంత్రం రాకముందు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడింది.. కాకతీయుల చరిత్ర కలిగిన వరంగల్ లో నిర్మించడం హర్షణీయం..” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్