సరిహద్దుల నిర్ధారణ పేరుతో జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం..
తెలంగాణ, 2 మార్చి (హి.స.) అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దుల నిర్ధారణ పేరుతో జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో.. కొంతమంది దందాలకు పాల్పడుతున్నారని.. రసీదులు, వాట్సాప్ మెస్స
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్


తెలంగాణ, 2 మార్చి (హి.స.)

అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దుల నిర్ధారణ పేరుతో జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో.. కొంతమంది దందాలకు పాల్పడుతున్నారని.. రసీదులు, వాట్సాప్ మెస్సెజ్ల ఆధారాలతో సహా స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రంగనాథ్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణపై హైడ్రా చేస్తున్న కసరత్తును ఆసరాగా తీసుకుని.. ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. నీట మునిగిన లే ఔట్ ప్లాట్లను కాపాడేందుకు ఖర్చు అవుతుందని ఎవరైనా దందాలు చేస్తే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దందాలకు పాల్పడుతున్న వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాధితులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande