విజయవాడ, 2 మార్చి (హి.స.)
ఇబ్రహీంపట్నం గ్రామీణం, కారు ఢీకొని ఓ వైద్య విద్యార్థిని మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పశ్చిమ ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన మహమ్మద్ తాజ్ అప్సా (19) ఇబ్రహీంపట్నం నిమ్రా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటూ నిత్యం కళాశాలకు వెళ్తుంటుంది. శనివారం ఉదయం స్నేహితురాలైన అర్‌జూ మహావిష్‌తో కలసి ద్విచక్ర వాహనంపై కళాశాలకు బయలుదేరారు. జూపూడి వద్ద మలుపు తీసుకొని కళాశాల వైపు వె కిళ్తుండగా అదేసమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ ద్విచక్రవాహనంతో సహా దూరంగా ఎగిరిపడ్డారు. అప్సా తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందగా..మరో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రురాలిని, అప్సా మృతదేహాన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల