తెలంగాణ, జగిత్యాల. 2 మార్చి (హి.స.)
శుభకార్యానికి బయలుదేరిన జంటను
ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల మండలం ఎక్కిన్పూర్ గ్రామానికి చెందిన జవుడి నర్సారెడ్డి, అతని భార్య అనసూయతో కలిసి ద్విచక్ర వాహనం పై మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి శుభకార్యానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వేంపల్లి నుండి మెట్ పల్లికి వస్తున్న ఆర్టీసీ బస్ పట్టణ శివారులోని ఎస్సార్ ఫంక్షన్ హాల్ దగ్గర నర్సారెడ్డి (65) ని ఢీకొంది.
నర్సారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. భార్య అనసూయకు గాయలపాలవ్వడంతో మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కు తరలించినట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్