విజయవాడ, 2 మార్చి (హి.స.)
తిరుమల, : ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శనివారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 12 కంపార్ట్‌మెంట్ల్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 8 గంటల్లో, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శుక్రవారం శ్రీవారిని 52,731 మంది దర్శించుకున్నారు. రూ.3.24 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల