సిద్దిపేట2 మార్చి (హి.స.)
పార్లమెంటు ఎన్నికల్లో మూడో సారి నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రతిపక్షాల తీరు పార్లమెంటు (Parliament)లో విచిత్రంగా ఉందని ప్రజానీకం అంతా ఒకటే భావనతో అన్నారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etala Rajender) అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ఆర్థికంగా, బలంగా ఉండాలన్నా, ప్రపంచంలో దేశం సగౌరవంగా ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలనేది ప్రజలకు తెలుసునని అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కు 44 శాతం వస్తే.. బీజేపీకి 30 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తాండవిస్తోందని, ప్రపంచం లో 11 వ ఆర్థిక వ్యవస్థలో ఉన్న భారత్ మోదీ కృషితో 5 వ స్థానానికి వచ్చిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు