న్యూఢిల్లీ, 3 మార్చి (హి.స.): గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) హర్యానాలోని ఫరీదాబాద్‌లోని పాలి ఏరియాలో ఒక టెర్రరిస్టును అరెస్టు చేసింది. అతని నుంచి రెండు గ్రెనేడ్‌లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకుంది. కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్‌టీఎఫ్ సహకారంతో గుజారాత్ ఏటీఎస్ ఈ గాలింపు చర్యలు చేపట్టింది. రామమందిరంపై దాడి చేయడం టెర్రరిస్టు టార్గెట్‌లలో ఒకటిగా ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు. రెహ్మా్న్‌కు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్‌కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు అతన్ని గుజరాత్‌కు తరలిస్తు్న్నారు. రెహ్మాన్ అరెస్టుతో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నమైనట్టు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు