తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య..
తెలంగాణ, 3 మార్చి (హి.స.) తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి నుంచి (మార్చి 5, 2025) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన
ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య..


తెలంగాణ, 3 మార్చి (హి.స.)

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి నుంచి (మార్చి 5, 2025) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయని, అందులో అత్యధికంగా 244 సెంటర్లు హైదరాబాద్లోనే ఉన్నాయని ఆయన వివరించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా పూర్తయ్యాయని, ఆర్టీసీ అధికారులను కూడా అలర్ట్ చేశామని వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande