తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం 3 మార్చి (హి.స.)
మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తికి గురైన 14 మంది సభ్యులు జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు.
యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న 'ఆపరేషన్ చేయూత' కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారుల ఎదుట చత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన 14 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్