విజయవాడ, 4 మార్చి (హి.స.)
విశాఖ: రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ హోదా కొనసాగేలా చర్యలు వేగవంతం చేసింది. బీచ్‌పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా ఇద్దరు అధికారులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యటక శాఖ అధికారి జ్ఞానవేణిని బదిలీ చేసిన ప్రభుత్వం.. తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఆమె స్థానంలో జి.దాసును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల