అమరావతి. 4 మార్చి (హి.స.)
ఏపీ శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఛార్జీల పెంపుపై అంశంపై క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదు, పెంచబోదని.. విద్యుత్ ఛార్జీల బకాయిల పాపం మాత్రం జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఆరోపణలు సత్యదూరమైనవి.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలను వైఎస్సార్సీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని.. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..