అమరావతి. 4 మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
నాలుగో రోజు ఉదయం 9 గంటలకు
ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పశ్నోత్తరాలతో సభను మొదలు పెట్టారు. అయితే, ప్రశ్నోత్తరాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సెషల్లో మొదటి ఆరు ప్రశ్నలు వాయిదా పడటంపై ఆయన ఓకింత అసహనం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నగా ఏడో ప్రశ్న రావడం ఏంటని అన్నారు.
అదేవిధంగా రెండు ప్రశ్నలు వేసి సభకు హాజరు కాని వైసీపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మూడు ప్రశ్నలను వాయిదా వేయాలని కూటమి సభ్యులు స్పీకర్ ను కోరారు. ఇక ఆరో ప్రశ్నకు సమాధానం చేప్పేందుకు సభలో మంత్రి అందుబాటులో లేకపోవడం.. మంత్రులు సమయానికి అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..