వైసీపీ సమాజానికి హానికరం..ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఏ.పీ, అమరావతి. 4 మార్చి (హి.స.) ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ పై సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వ
పయ్యావుల కేశవ్


ఏ.పీ, అమరావతి. 4 మార్చి (హి.స.) ఏకంగా 13.4 శాతానికి అప్పులు

తీసుకొచ్చారు.. వీళ్లని ఏమనాలి..? అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్ పై సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు.. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చినట్లు.. వైసీపీ సమాజానికి హానికరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.. ఇక, గత, ప్రభుత్వం చేసిన అప్పులపై స్పందిస్తూ.. 9 శాతానికి మించి ఉన్న అప్పులను గుర్తించాం.. దాదాపు 141 రుణాలు ఉన్నాయి. కొన్ని దాదాపు 13.4 శాతం వరకు వడ్డీకి తెచ్చారు. 9 శాతం.. 10 శాతం.. 11 శాతం.. 12 శాతం.. ఇలా పెంచుకుంటూ పోతూ ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారంటే.. వీళ్లనేమనాలి..? అని నిలదీశారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande