చతిస్గడ్, 4 మార్చి (హి.స.)
ఛత్తీస్గఢ్ మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్టీజీ సైనికులు ధ్వంసం చేశారు.
ఛత్తీస్గఢ్లోని ధామ్లారి జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో 25 నుంచి 30 మంది మావోలు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..