ఔరంగాజేబును ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోండి.. బీజేపీ నాయకురాలు నవనీత్ రానా.
ముంబై, 4 మార్చి (హి.స.) ఔరంగాజేబును ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా మండిపడ్డారు. ఔరంగజేబ్ను పొగుడుతూ ఇటీవల సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశార
బీజేపీ నాయకురాలు నవనీత్ రానా.


ముంబై, 4 మార్చి (హి.స.) ఔరంగాజేబును ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా మండిపడ్డారు. ఔరంగజేబ్ను పొగుడుతూ ఇటీవల సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్, శంభాజీ మహరాజ్ పాలించారు. చరిత్ర తెలియని నీలాంటి వాళ్లు తప్పకుండా 'ఛావా (Chhava)' సినిమా చూడాలి. అప్పుడు మన రాజుపట్ల ఔరంగజేబ్ ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తెలుస్తుంది' అంటూ అబూ అజ్మీపై మాటల దాడి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande