పసిడి పరుగు: భారీగా పెరిగిన ధరలు
హైదరాబాద్, 4 మార్చి (హి.స.)వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎ
gold


హైదరాబాద్, 4 మార్చి (హి.స.)వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 760 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande