తెలంగాణ, సిద్దిపేట. 4 మార్చి (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి
మల్లికార్జున స్వామి వారిని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెదక్ ఎంపీ రఘునందన్ తో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన దత్తాత్రేయ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.మల్లికార్జున స్వామిని దర్శించుకొని, గర్భాలయంలో శివలింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖమండపంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు,తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి మెమో టోను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్