ఏ.పీ, 4 మార్చి (హి.స.) భారత స్టార్ రెజ్లర్, ఒలంపియన్.. సుశీల్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్కు రెగ్యులర్ బెయిల్ దక్కింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ 2021లో హత్యకు గురయ్యాడు. దాంతో పోలీసులు 2021 మే నెలలో సుశీల్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో కూడా సుశీల్కు బెయిల్ దొరికింది.
2023 జూలైలో మోకాలి శస్త్రచికిత్స కోసం ఆయనకు 7 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. మంగళవారం ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కాగా సుశీల్ కుమార్ ఒలింపిక్స్లో భారతదేశానికి రజత, కాంస్య పతకాలు అందించారు. సాగర్ ధన్కర్ హత్య కేసులో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో సుశీల్ కుమార్ కూడా ఒకరిగా ఉన్నాడు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..