న్యూఢిల్లీ. 4 మార్చి (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటన మంగళవారం బీజీ బిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ ని కలిశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కూడా ఉన్నారు. అరగంట పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ధాన్యం
సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరినట్లుగా సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..