తెలంగాణ.రంగారెడ్డి, 4 మార్చి (హి.స.)
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా భూ బాధిత రైతులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2200 ఎకరాల పట్టా భూమిని టిఎస్ఐసీ పేరు తొలగించి రైతుల పేర్లను ఆన్లైన్ రికార్డులో నమోదు చేయాలన్నారు. కోర్టులో ఫార్మాకు అనుకూలంగా ఉన్నామని చెప్పిన ప్రభుత్వం రైతులకు మాత్రం ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని మోసపూరిత మాటలు చెప్పడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్