జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి.. గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కుమార్
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 4 మార్చి (హి.స.) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు ఎస్. ఆర్. విద్యానికేతన్ (గద్వాల్),
గద్వాల జిల్లా కలెక్టర్


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 4 మార్చి (హి.స.)

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు ఎస్. ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, వెంటిలేషన్, తదితర అంశాలను పరిశీలించి, పాఠశాల యాజమాన్యానికి అవసరమైన సూచనలు అందించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande