గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హరీశ్ రావు లేఖ.
తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తాజాగా మంగళవారం లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీకర్ ను లే
హరీష్ రావు లేఖ


తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తాజాగా మంగళవారం లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీకర్ ను లేఖలో హరీశ్ రావు ప్రశ్నించారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(10) ప్రకారం.. రాతపూర్వక సమాధానాలు టేబుల్ మీద ఉంచాలని గుర్తు చేశారు. గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రయోజనాల కోసం సభలో ప్రశ్నలు అడగడం, సకాలంలో సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అని ఆయన లేఖలో స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని స్పీకర్ను హరీశ్ రావు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande