వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత..
తెలంగాణ, 4 మార్చి (హి.స.) వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టు భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను మంగళవారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నక్కలపల్లి, గుంటురుపల్లి, నల్లకుంట, గాడిపెల్లిలో భూమి కోల్ప
వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత


తెలంగాణ, 4 మార్చి (హి.స.)

వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టు భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను మంగళవారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నక్కలపల్లి, గుంటురుపల్లి, నల్లకుంట, గాడిపెల్లిలో భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న నిర్వాసిత రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తున్నారు.తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని రహదారిపై బైటాయించి నిరసనకు దిగారు

మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్నారు రైతులు. సరైన పరిహారంతో పాటు తమ గ్రామాలకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వే అనుమతిస్తామంటున్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande