తెలంగాణ, జగిత్యాల. 4 మార్చి (హి.స.)
ప్రభుత్వం నిర్దేశించిన ఇండ్ల నమూనా ప్రకారం లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉన్న ఎర్రపూర్, ఎర్రపూర్ తండా, కథలాపూర్ మండలంలోని పోసానిపేట్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం ప్రక్రియ ను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్