తెలంగాణ, హైదరాబాద్. 4 మార్చి (హి.స.) ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మెందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎక్స్ వేదికగా అన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఆయన విమర్శించారు. బీజేపీ అంటే నమ్మకం కాదు... అమ్మకం అంటూ పేర్కొన్నారు.
నిర్మాణ రంగంలో సిమెంట్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సీసీఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్