ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్.కళ్యాణ్ సోమవారం అసెంబ్లీ.లోని సిఎం.ఛాంబర్.లో.భేటీ.అయ్యారు
విజయవాడ, 4 మార్చి (హి.స.) , అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంటపాటు ఇద్దరూ చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్ని
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్.కళ్యాణ్ సోమవారం అసెంబ్లీ.లోని సిఎం.ఛాంబర్.లో.భేటీ.అయ్యారు


విజయవాడ, 4 మార్చి (హి.స.)

, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంటపాటు ఇద్దరూ చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ కొద్దిసేపు చర్చించారు. ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చుని ఉండగా.. పవన్‌ కల్యాణ్‌ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ఛాంబర్‌కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సమతూకంతో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపైనా వారి మధ్య చర్చ జరిగింది. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రహదారుల పనులు చాలావరకు చేశామని.. తాగునీటి సరఫరాపై ఎక్కువ దృష్టిపెట్టామని చంద్రబాబుకు డిప్యూటీ సీఎం వివరించారు. ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకుని పెద్దఎత్తున పనులు చేయాల్సిన అవసరంపైనా చర్చించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారుల్ని భయపెట్టి తరిమేయడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నారని.. వారిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు ఆయనకు వివరించారు. ఉపాధి, ఉద్యోగకల్పనే లక్ష్యంగా పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande