గిర్‌ అభయారణ్యంలో మోదీ సఫారీ
సాసన్‌ (గుజరాత్‌): 4 మార్చి (హి.స.) ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. సింహాల్ని చూడడానికి సఫారీ చేశారు. వీటి ఆవాస ప్రాంతాన్ని సంరక్షించడంలో చుట్టుపక్
గిర్‌ అభయారణ్యంలో మోదీ సఫారీ


సాసన్‌ (గుజరాత్‌): 4 మార్చి (హి.స.) ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. సింహాల్ని చూడడానికి సఫారీ చేశారు. వీటి ఆవాస ప్రాంతాన్ని సంరక్షించడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనులు, మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు. ‘‘గిర్‌ ప్రాంతానికి రాగానే గుజరాత్‌ సీఎంగా నేను ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలతో కలిసి చేసిన ప్రయత్నాలు మదిలో మెలగుతున్నాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉమ్మడి ప్రయత్నాల వల్ల మృగరాజుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. వీటితోపాటు పులులు, చిరుతలు, ఖడ్గమృగాల సంఖ్యా వృద్ధి చెందుతోంది. వన్యప్రాణులపై మనకున్న బలమైన ఆపేక్షను, వాటి ఆవాసాలు సుస్థిరంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇవి చాటుతున్నాయి’’ అని ‘ఎక్స్‌’లో రాశారు. తనకు తారసపడిన సింహాల ఛాయాచిత్రాలనూ జతచేశారు. ఆసియా సింహాల సంరక్షణకు కేంద్రం రూ.2,900 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande