తెలంగాణ, 4 మార్చి (హి.స.)
ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన జీవన శైలిలో క్రీడల పాత్ర కీలకమని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖేలో ఇండియా, అందరికీ క్రీడలు, ఉత్తమ క్రీడలు అనే అంశాల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 1000 మంది అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఏటా నిధులు అందించే పాన్-ఇండియన్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందించారు.
ఈ సందర్భంగా మల్కాజ్గరి నియోజకవర్గ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆటలు, క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితాలను గడపడంలో యోగాసనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్