మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా..
మహారాష్ట్ర, 4 మార్చి (హి.స.) మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలోని కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండే రిజైన్ చేశారు. సర్పంచ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావ
మహారాష్ట్ర మంత్రి


మహారాష్ట్ర, 4 మార్చి (హి.స.) మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలోని కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండే రిజైన్ చేశారు. సర్పంచ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో సీఎం ఫడ్నవీస్ సూచనల మేరకు ధనంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన రాజీనామాను తాను ఆమోదించినట్లు సీఎం తెలిపారు. అనంతరం ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు పంపినట్లు మీడియాకు తెలిపారు.

కాగా, బీడ్ సర్సంచ్ సంతోష్ దేశముఖ్ను డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కరాడ్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande