తెలంగాణ, నల్గొండ. 4 మార్చి (హి.స.)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం సూచించారు. జిల్లాలోని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, డిపో హోల్డర్ ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆశా కార్యకర్తలు ప్రతీ గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించి కాన్పు అయ్యే విధంగా చూడాలని అన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్