న్యూఢిల్లీ. 4 మార్చి (హి.స.)
పాకిస్తానీ అని ఎవర్నైనా పిలిస్తే, అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ కేసు విచారణలో భాగంగా నేడు.. మియాన్-తియాన్ లేదా పాకిస్తానీ అని పిలవడం హేళనకరమే అయినా, కానీ దాంట్లో మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు. జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరంగా ఉన్నా, అది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కాదు అని సుప్రీం బెంచ్ తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..