నెల్లూరు, 4 మార్చి (హి.స.)
:ఆత్మకూరు ()లో పోస్టల్ ఏజెంట్ అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారుల అకౌంట్ల నుంచి పోస్టల్ ఏజెంట్ షేక్ ఇమామ్ ఖాసీం) లక్షల రూపాయలు విత్ డ్రా ) చేశాడు. ఆత్మకూరులో నారాయణ రెడ్డి అతని కుటుంబ సభ్యులకు చెందిన ఆరు ఖాతాల నుంచి సుమారు రూ. 31 లక్షలు విత్ డ్రా చేశాడు. ఇమామ్ ఖాసీంపై అనుమానం వచ్చిన ఖాతాదారులు తమ అకౌంట్లను పరిశీలించారు. దీంతో మూడూళ్లుగా ఇమామ్ కాశీం చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. దీంతో బాధితులు ఇమామ్ కాశీంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల