తెలంగాణ, జనగామ. 4 మార్చి (హి.స.)
టిప్పు సుల్తాన్ వారసుడినని... ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డాక్టర్ సుల్తాన్ రాజ్.. టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్గా చలామణి అవుతున్నాడు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా అనే వైద్యుడు జనగామలో గత కొంతకాలంగా కేకే ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిని బురిడీ కొట్టించాడు.
ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి సుల్తాన్ రాజా మోసం చేశాడు. పలువురు నుంచి మొత్తం ఐదు కోట్ల 56 లక్షల 75 వేల రూపాయలు వసూలు చేశాడు. అయితే గత ఎనిమిది నెలలుగా సుల్తాన్ రాజా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్