ఏ.పీ, నంద్యాల. 4 మార్చి (హి.స.) నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలం కల్వటాల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈప్రమాదంలో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమ్మల మడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..